News July 28, 2024

ఫలితాలు విడుదల

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ <>విడుదల<<>> చేసింది. దేశవ్యాప్తంగా 13 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. https://exams.nta.ac.in/ ద్వారా రిజల్ట్స్ చూసుకోవచ్చు. త్వరలో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Similar News

News September 13, 2025

ఇంగ్లండ్‌.. హయ్యెస్ట్ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్!

image

ఫార్మాట్ ఏదైనా అత్యధిక స్కోర్లు నమోదు చేయడం ఇంగ్లండ్‌కు చాలా మామూలు విషయం అని చెప్పవచ్చు. వన్డేల్లో టాప్-3 హయ్యెస్ట్ స్కోర్లు (498/4 vs NED, 481/6 vs AUS, 444/3 vs PAK) ఆ జట్టు పేరిటే ఉంది. టెస్టుల్లో శ్రీలంక (952/6 vs IND) తర్వాత రెండో అత్యధిక స్కోర్ కూడా ENG పేరు మీదనే (903/7d vs AUS) నమోదైంది. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో ఫుల్ మెంబర్ టీమ్‌పై అత్యధిక స్కోర్ (304/2vsSA) చేసింది కూడా ఇంగ్లండే.

News September 13, 2025

మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

image

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.

News September 13, 2025

మైథాలజీ క్విజ్ – 4

image

1. అర్జునుడు తపస్సు చేసి, ఎవర్ని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందాడు?
2. శూర్పణఖ ఎవరి చెల్లి?
3. ‘త్రిసూర్ పురం’ అనే పండగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ‘నవకళేబర’ ఉత్సవం ఏ ఆలయంలో జరుగుతుంది?
5. హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణు అవతారం ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను ‘మైథాలజీ క్విజ్-5’(రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.