News November 28, 2024

ఫలితాలు విడుదల

image

TG: పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. ఈసీఈ, ఈఐఈ, అర్కిటెక్చర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ లెటర్ ప్రెస్ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో పొందుపరిచింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News December 5, 2025

14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://examinationservices.nic.in/<<>>

News December 5, 2025

Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

image

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.

News December 5, 2025

మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.