News October 22, 2024
కేజీబీవీలకు రూ.24 కోట్లు రిలీజ్

AP: కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) అదనపు గదులు, లేబొరేటరీలు ఇతర సివిల్ పనుల కోసం సమగ్ర శిక్ష రూ.24.84 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.20.61 కోట్లు నిర్మాణాలకు, రూ.4.23 కోట్లు రిపేర్ల కోసం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అన్ని పనులను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
Similar News
News November 22, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సికింద్రాబాద్, దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో Jr, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.
News November 22, 2025
అవకాడోతో కురులకు మేలు

అవకాడో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంతోపాటు కురులకూ మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోని హెయిర్ ప్యాక్‌తో జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు తొందరగా పెరుగుతుంది. అవకాడో, అరటి పండు పేస్ట్ చేసి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15రోజులకొకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


