News October 8, 2024
పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Similar News
News January 27, 2026
ధాన్యం నిల్వలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకలను కట్టడి చేయకుంటే అవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.
News January 27, 2026
మాట తప్పడం, మడమ తిప్పడం TDP రక్తంలోనే లేదు: లోకేశ్

AP: పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు. ‘పార్టీనే అందరికీ అధినాయకత్వం. చంద్రబాబు సేనాధిపతి. మనమంతా ఆయన సైనికులం. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు’ అని తెలిపారు.
News January 27, 2026
వీరు కాఫీ తాగితే ప్రమాదం

రోజూ తగినంత మోతాదులో కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. గర్భవతులు, బాలింతలు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ తాగినా 200 మిల్లీ లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


