News October 9, 2024

స్థానిక సంస్థలకు రూ.287 కోట్లు విడుదల

image

AP: గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.287.12 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ జీవో ఇచ్చారు. ఇటు PM జన్‌మన్ పథకం కింద 332 గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.29.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

Similar News

News September 14, 2025

నేటి నుంచి తిరుపతిలో మహిళా సాధికార సదస్సు

image

AP: తిరుపతిలో నేటి నుంచి 2రోజుల పాటు జాతీయ మహిళా సాధికార సదస్సు జరగనుంది. ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు హాజరై ప్రసంగించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. దేశ‌వ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు రానుండగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 14, 2025

దాయాదితో నేడే పోరు.. ఆసక్తి కరవు!

image

భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం అలర్ట్ అవుతుంది. టోర్నీ, వెన్యూ, ఫార్మాట్‌తో సంబంధంలేకుండా మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఆసియా కప్‌లో ఇవాళ టీమ్ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా ఆ ఉత్కంఠ లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతా మారిపోయింది. దాయాది దేశంతో క్రికెట్ వద్దని అంతా వారిస్తున్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది. మరి మీరు ఇవాళ మ్యాచ్ చూస్తారా? COMMENT.

News September 14, 2025

రూ.81 వేల వరకు జీతం.. ఇవాళే లాస్ట్!

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100(అలవెన్సులు అదనం) వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్‌సైటును సంప్రదించగలరు.