News July 31, 2024

పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

image

AP: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. పేరెంట్స్ కమిటీల పదవీకాలం పూర్తవడంతో ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. 8న కమిటీ సభ్యుల ఎన్నిక, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు.

Similar News

News February 1, 2025

ఇది దేశ గతినే మార్చే బడ్జెట్: బండి సంజయ్

image

TG: కేంద్ర బడ్జెట్ దేశ గతినే మార్చుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇది. బడ్జెట్‌పై విపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలి. కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించాలి’ అని అన్నారు. అలాగే, ఇది ప్రజారంజక బడ్జెట్ అని MP DK అరుణ కొనియాడారు. రూ.12లక్షల వరకు IT కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని చెప్పారు.

News February 1, 2025

ముగిసిన సీఎం సమీక్ష

image

TG: మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సుదీర్ఘంగా జరిగిన భేటీలో వివిధ శాఖలు, రంగాలకు బడ్జెట్ అవసరాలపై చర్చలు జరిపారు. నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.

News February 1, 2025

తక్కువ వడ్డీతో రూ.5లక్షల రుణం.. ఇలా చేయండి

image

కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్రం రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. కౌలు రైతులు, భూ యజమాని-సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు. వడ్డీ కేవలం 4శాతం(7శాతంలో 3% కేంద్రం రాయితీ) ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా కార్డు తీసుకోవచ్చు. రూ.2లక్షలలోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు.