News October 19, 2024
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

AP: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు, 24న రూ.300 దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 24న మధ్యాహ్నం 3 గంటలకు గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


