News May 24, 2024
టెన్త్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల

AP: టెన్త్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 55,966 మంది దరఖాస్తు చేసుకోగా, 43,714 మంది ఆన్సర్ షీట్ల రిజల్ట్స్ను రిలీజ్ చేసింది. మిగతా విద్యార్థుల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పాఠశాలల హెడ్మాస్టర్ల లాగిన్ నుంచి ఫలితాల కాపీలను పొందవచ్చన్నారు.
Similar News
News December 9, 2025
పేరెంట్స్కు పిల్లలకు మధ్య న్యూరో సింక్రోని

తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉండే న్యూరో సింక్రోని వల్లే పిల్లల్లో భాష, జీవన నైపుణ్యాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగ నియంత్రణకు, ప్రేమ, అనుబంధాల ప్రేరణకు న్యూరో సింక్రోని కీ రోల్ పోషిస్తుంది. అలాగే అమ్మ మాట, పాట వంటివి పిల్లలల్లో నాణ్యమైన నిద్రకు కారణం అవుతాయి. పేరెంట్స్ కారణంగా తాను సురక్షితంగా ఉన్నాను అనే భావనను న్యూరో సింక్రోని పెంపొందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News December 9, 2025
ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.
News December 9, 2025
రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.


