News November 4, 2024
TG టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన అర్హులు. స్కూలు అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో టీచర్లు పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Similar News
News February 17, 2026
సల్మాన్ తండ్రి సలీమ్‌కు అస్వస్థత

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ (90) అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సహా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు. మరో బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్‌తో కలిసి షోలే, దీవార్, జంజీర్, త్రిశూల్, డాన్ వంటి బ్లాక్‌బస్టర్లు అందించారు.
News February 17, 2026
హీరోయిన్‌గా ఖుష్బూ కూతురు

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఆరంభం’ అనే మలయాళ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుజేశ్ అన్నీ ఈపెన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ‘ఆరతి’ అనే పాత్రలో కనిపించనున్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం ఖుష్బూ కూడా మలయాళ సినిమాతోనే కెరీర్ ప్రారంభించడం విశేషం. మలయాళం, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది.
News February 17, 2026
జనగామ.. ‘లక్కీ డ్రా’మా

TG: అనూహ్య పరిణామాల మధ్య జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్‌నే అదృష్టం వరించింది. ఆ పార్టీకి చెందిన బాలమణి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో BRS సభ్యులు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలోనూ లక్కీ డ్రా తీయగా కాంగ్రెస్‌కే ఛైర్మన్(శ్రవణ్) పదవి దక్కింది.


