News May 4, 2024
TS SET నోటిఫికేషన్ విడుదల

ఓయూ ఆధ్వర్యంలో నిర్వహించే TS SET నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14 నుంచి జులై 2 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్కు అవకాశం ఉంటుంది. అదే నెల 28 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రభుత్వం TS SETను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2025
క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.


