News April 21, 2024

యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

image

భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీకి అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ నెట్‌’కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ తెలిపింది. ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే నెల 10న రాత్రి 11.50గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. అప్లికేషన్లలో పొరపాట్లుంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో సరిచేసుకోవచ్చు.

Similar News

News January 22, 2026

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 22, 2026

CSIRలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు

image

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్& ఇండస్ట్రియల్ రీసెర్చ్ (<>CSIR<<>>) 8 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. UPSC నిర్వహించిన CSE-2024 లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కాని వారు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.csir.res.in/

News January 22, 2026

వసంత పంచమి.. విద్యార్థులకు సువర్ణవకాశం!

image

వసంత పంచమి రోజున విజయవాడ దుర్గమ్మ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫాం, ఐడీ కార్డుతో వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. అలాగే పెన్ను, శక్తి కంకణం, అమ్మవారి ఫొటో, లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నారు. మహామండపంలో ఉత్సవమూర్తికి పూజలు, యాగశాలలో సరస్వతీ హోమం నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులు పూజలో ఉంచి అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు తెలిపారు.