News January 25, 2025

నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

image

మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’కి మలయాళంలో పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం తెలుగులోనూ రిలీజైంది. తాజాగా ఈ మూవీ OTT రైట్స్ దక్కించుకున్న జీ5 జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే థియేటర్లలో రిలీజైన వారానికే OTTలోకి వస్తుండటం గమనార్హం. మూవీలో టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో ఇప్పటి వరకు రూ.18కోట్లకు పైగా వసూలు చేసింది.

Similar News

News December 8, 2025

ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

image

* డెంటల్ ప్రాబ్లమ్స్ లేదా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్య అనిపించేలా దవడ నొప్పి
* పుల్లటి త్రేన్పులు, తరచూ వికారంగా ఉండడం, వాంతులు.
* అజీర్ణ సమస్యలు. ఫుడ్ పాయిజన్ కారణమనే భావన.
* హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గులు.
* వెన్నెముక పైన, భుజం బ్లేడ్‌ల మధ్యలో, బ్రెస్ట్ కింది భాగంలో నొప్పి.
* శారీరక శ్రమ లేకున్నా చెమటలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
* ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

News December 8, 2025

డెలివరీ తర్వాత జరిగే హార్మోన్ల మార్పులివే..!

image

ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. డెలివరీ అయిన వెంటనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉండటంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటివి జరుగుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ వంటివి కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

CHROME వాడుతున్నారా?.. యాపిల్ హెచ్చరిక

image

గూగుల్ క్రోమ్ వాడే ఐఫోన్ యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించింది. Chrome బ్రౌజర్ ‘డివైజ్ ఫింగర్‌ప్రింటింగ్’ అనే రహస్య ట్రాకింగ్ పద్ధతి ద్వారా యూజర్ల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని పేర్కొంది. దీనిని ఆఫ్ చేసే అవకాశం యూజర్లకు లేదని తెలిపింది. అలాగే Safariలో ‘Try App’ లింక్‌లను నొక్కితే Google App ఓపెన్ అవుతోందని తద్వారా మరింత డేటాను సేకరిస్తుందని అభిప్రాయపడింది. Safari బ్రౌజర్ సేఫ్ అని స్పష్టం చేసింది.