News August 20, 2024

రిలయన్స్, డిస్నీ డీల్: హెచ్చరించిన సీసీఐ!

image

రిలయన్స్, వాల్ట్ డిస్నీ విలీనంతో పోటీదారులకు నష్టమని CCI భావిస్తున్నట్టు తెలిసింది. క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులన్నీ వారి వద్దే ఉండటంతో ఆందోళన చెందుతోంది. తమ అభిప్రాయమేంటో చెప్పిన సంస్థ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించొద్దో చెప్పాలని ఆ 2 కంపెనీలను అడిగినట్టు సమాచారం. ఈ విలీనంతో సోనీ, జీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, 120 TV ఛానళ్లు, 2 స్ట్రీమింగ్ సర్వీసులకు ఇబ్బందని, మోనోపలీకి ఆస్కారం ఉందని నిపుణుల భావన.

Similar News

News December 4, 2025

జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

image

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.

News December 4, 2025

డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

image

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం

News December 4, 2025

డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

image

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం