News September 27, 2024
ఏపీకి రిలయన్స్ రూ.20 కోట్ల విరాళం

APలో వరద బాధితుల కోసం రిలయన్స్ సంస్థ భారీ విరాళం అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ తరఫున రూ.20 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు మెంబర్ ప్రసాద్, సంస్థ మెంటార్ మాధవరావు ఇచ్చారు. అటు ITC గ్రూప్ రూ.2 కోట్లు, LG పాలిమర్స్ సంస్థ రూ.2 కోట్లు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా మోహన్ బాబు రూ.25 లక్షల విరాళం సీఎంకు అందించారు.
Similar News
News November 15, 2025
రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వెంటే: మహేశ్ కుమార్

TG: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై సంతృప్తితోనే ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని గెలిపించారని PCC చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు సాధిస్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లపై CONG కమిట్మెంటుతో ఉందని, బీజేపీయే అడ్డుపడుతోందని విమర్శించారు. కాగా CM రేవంత్, DyCM భట్టి, మహేశ్, ‘జూబ్లీ’ విజేత నవీన్ ఇతర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిశారు.
News November 15, 2025
బాలికకు 100 సిట్ అప్స్ శిక్ష.. మృతి

నిన్న బాలల దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని వాసాయిలో దారుణం జరిగింది. స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని కాజల్ అనే ఆరోతరగతి చిన్నారికి టీచర్ 100 సిట్ అప్స్ పనిష్మెంట్ విధించింది. అవన్నీ పూర్తి చేసిన బాలిక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఇంటికి చేరుకోగానే ఆరోగ్యం క్షీణించింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2025
గత 6ఏళ్లలో FDIల సాధనలో AP వెనుకబాటు

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సాధనలో 2019 OCT-2025 JUN మధ్య కాలంలో AP బాగా వెనుకబడింది. ఆ కాలంలో $1.27B FDIలతో ఏపీ 14వ స్థానానికి పరిమితమైంది. దేశ FDIలలో ఏపీ వాటా 0.2%-0.7% కాగా కర్ణాటక 14%-28% TN 3.7%-10% దక్కించుకున్నట్లు బిజినెస్ టుడే పేర్కొంది. 2025 జూన్ క్వార్టర్లో AP $307 M, కర్ణాటక $10 B, TG $2.3 B FDIలు సాధించాయి. కాగా VSP CII సమ్మిట్లో వచ్చిన 13L CR పెట్టుబడుల్లో FDIలూ ఉన్నాయి.


