News May 7, 2025
రూ.10లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ విలువ!

2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్ల నికర విలువకు చేరుకున్న కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. కంపెనీ వార్షిక లాభాలు రూ.69,646 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో రూ.19,407కోట్ల ఆదాయాన్ని కంపెనీ గడించింది. సంస్థ అప్పులు రూ.3.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ లాభం మార్చి త్రైమాసికంలో 25.7% వృద్ధితో రూ7,022 కోట్లకు పెరిగింది.
Similar News
News April 15, 2026
ఏఐకి శిక్షణ ఇచ్చే ఉద్యోగాలు.. గంటకు ₹14 వేలు!

Aiతో ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడుతున్నారు. కానీ ఏఐకే శిక్షణ ఇచ్చే ఉద్యోగాలున్నాయి. ఈ రంగంలోకి అడుగుపెడుతున్న లింక్డ్ ఇన్ ‘ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్’ను టెస్ట్ చేస్తోంది. Ai ట్రైనర్లకు స్కిల్‌ను బట్టి గంటకు ₹3,700-14,000 ఇవ్వనున్నట్లు లిస్టింగ్స్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా రంగాల నిపుణులు ఏఐ టూల్స్ సామర్థ్యాలను పరీక్షించడం, స్పందనలకు రేటింగ్ ఇవ్వడం, లోపాలను గుర్తించడం వంటివి చేస్తారు.
News April 15, 2026
ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం
News April 15, 2026
పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.


