News August 25, 2025
డిప్యూటీ స్పీకర్ RRRకు ఊరట

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. HYD గచ్చిబౌలి PSలో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. MPగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారని RRRతో పాటు ఆయన కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై FIR నమోదైంది. ఈ కేసును కొనసాగించలేనని కానిస్టేబుల్ బాషా వేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం FIRను కొట్టేస్తూ తీర్పిచ్చింది.
Similar News
News August 25, 2025
కేటీఆర్.. అప్పుడు మీ దమ్ముకు ఏమైంది?: MP కిరణ్

TG: పార్టీ మారిన MLAలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ KTR విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ MP చామల కిరణ్ కౌంటరిచ్చారు. ‘పదేళ్లలో 60 మంది MLAలు పార్టీ మారితే అప్పుడు మీ దమ్ముకు దుమ్ము పట్టిందా? మీరు HYDలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా పార్లమెంట్‌లో సున్నా వచ్చింది’ అని అన్నారు. BJPని విమర్శిస్తూ ‘కేంద్రం చంద్రబాబుకు ఇచ్చే ఇంపార్టెన్స్ BJP MPలకు ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News August 25, 2025
మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

AP: డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా రేపు(26.08.2025) మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేసి, మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు.
News August 25, 2025
TG PECET అడ్మిషన్ల సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

TG PECET-2025 (B.P.Ed, D.P.Ed ) అడ్మిషన్లకు సంబంధించి సెకండ్ (ఫైనల్) ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్‌లైన్ <