News December 18, 2024
హోంగార్డులకు హైకోర్టులో ఊరట

AP: కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా రూపొందించాలని తీర్పు చెప్పింది. కాగా, సామాజిక రిజర్వేషన్లు వర్తింపజేసి, ప్రిలిమినరీ పరీక్షలో తమకు క్వాలిఫైయింగ్ మార్కులు రాలేదంటూ తమను రాతపరీక్షలకు అనుమతించలేదని పలువురు కోర్టుకెక్కారు.
Similar News
News September 20, 2025
ఆశ్వయుజ మాసంలో వెల్లివిరియనున్న ఆధ్యాత్మికత

ఆశ్వయుజ మాసం పండుగలు, ఉత్సవాలతో ఆధ్యాత్మికతను నింపనుంది. సెప్టెంబర్ 22 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీశైలం క్షేత్రంలోనూ ఉత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 21న బతుకమ్మ సంబురాలు తెలంగాణలో ప్రారంభమై దుర్గాష్టమి వరకు కోలాహలంగా కొనసాగుతాయి. అదే సమయంలో సెప్టెంబర్ 24 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులను అలరిస్తాయి. ఈ ఉత్సవాల పరంపర దీపావళితో ముగుస్తుంది.
News September 20, 2025
రేపే సూర్యగ్రహణం.. మనకు కనిపిస్తుందా?

ఈ ఏడాదిలో చివరి గ్రహణం రేపు చోటుచేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10.59 గంటలకు ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్‌లో కనిపించనుంది. భారత్ నుంచి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే 2027 AUG 2 వరకు వేచి చూడాల్సిందే.
News September 20, 2025
చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తా: CBN

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలకులు విధించిన చెత్త పన్ను తొలగించామని, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకున్నామని CM చంద్రబాబు అన్నారు. మాచర్లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. ‘గతంలో ఇక్కడ చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా. మన పరిసరాల్లోని చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తా’ అని చంద్రబాబు తెలిపారు.