News June 17, 2024
బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్?

ఆదాయ పన్ను కనిష్ఠ స్లాబ్ రేట్ పరిధిలోని వారికి బడ్జెట్లో ఊరట లభించే అవకాశం ఉందని CII కొత్త చీఫ్ సంజీవ్ పురీ తెలిపారు. ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంస్కరణలు చేపట్టేలా ఓ ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ఉండాలన్నారు. కాగా ఆదాయపన్ను తగ్గిస్తే వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 5, 2026
ఇండియాకు కీలకంగా మారనున్న దుగరాజపట్నం పోర్ట్.!

దుగరాజపట్నం నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15-18 వేల మందికి ఉపాధి లభించనుంది. నౌకల తయారీ, ఇంజినీరింగ్, అనుబంధ పరిశ్రమల రంగాల్లో స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి. మొదటి దశ పోర్టు, నౌక నిర్మాణ పనులు 2030 కళ్ల ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని టాప్ 5 నౌకల తయారీ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలన్న కేంద్రం లక్ష్యంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 5, 2026
సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్‌లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్‌కే ఉంది. తాజాగా యాషెస్‌లో ఆయన 41వ సెంచరీ సాధించారు.


