News December 24, 2024

కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

image

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్ కారణమంటూ ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

Similar News

News January 8, 2026

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

image

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.

News January 8, 2026

ఆ వార్త చదివి గుండె బద్దలైంది: శిఖర్ ధావన్

image

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై సామూహిక దాడి ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ వార్త చదివి గుండె బద్దలైంది. ఎవరిపైన అయినా, ఎక్కడైనా హింస ఆమోదయోగ్యం కాదు. బాధితురాలికి న్యాయం జరగాలి” అని ట్వీట్ చేశారు. కాగా ఇద్దరు వ్యక్తులు ఓ 40 ఏళ్ల హిందూ వితంతువును రేప్ చేసి, ఆమె జుట్టు కత్తిరించి, చెట్టుకు కట్టేసి టార్చర్ చేశారు. ఈ వీడియో SMలో <<18770990>>వైరల్‌<<>> అవుతోంది.

News January 8, 2026

రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

image

ట్రైన్లలో కోచ్‌ల శుభ్రత, బెడ్‌ రోల్స్‌కు సంబంధించి Rail Madad యాప్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్‌ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్‌బ్యాక్‌లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.