News April 3, 2025
KCRకు హైకోర్టులో ఊరట

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో ఆయనపై నమోదైన రైలురోకో కేసును హైకోర్టు కొట్టేసింది. ఉద్యమ సమయంలో ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో KCR రైలురోకో చేపట్టారు. దీంతో ఆయనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కేసీఆర్ కోర్టును ఆశ్రయించగా, కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News April 4, 2025
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు: BRS నేత

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని BRS నేత రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల్లో 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లలో లేరు. మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగగా, కేవలం 2 సెంటర్ల నుంచే 72 మంది టాపర్లున్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికీ టాప్ ర్యాంక్ రాలేదు. ఇదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు. 18, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు.
News April 4, 2025
SRH కెప్టెన్ కమిన్స్ చెత్త రికార్డ్

SRH కెప్టెన్ కమిన్స్ IPL చరిత్రలో ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. నిన్న KKR మ్యాచ్‌తో సహా 7సార్లు 50+ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మోహిత్శర్మతో పాటు టాప్‌లో నిలిచారు. మరోవైపు, ఈ లిస్టులో సునీల్ నరైన్ చిట్టచివర ఉన్నారు. 14ఏళ్లుగా లీగ్ ఆడుతూ ఒక్కసారి కూడా 50+ రన్స్ ఇవ్వలేదంటే ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్లుగా అతని బౌలింగ్‌ను డీకోడ్ చేయలేకపోవడం గొప్ప విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.
News April 4, 2025
అకాల వర్షాలు.. రైతులకు కడగండ్లు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు నాశనమయ్యాయి. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు ఇది పెద్ద దెబ్బే. కూరగాయలతోపాటు మామిడి, అరటి తదితర ఉద్యానవన పంటలు నేలకూలాయి. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.