News December 21, 2024
హైకోర్టులో మోహన్‌బాబుకు రిలీఫ్

నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వాడొద్దని సూచించింది. తన వ్యక్తిగత హక్కుల్ని రక్షించాలని కోరుతూ మోహన్‌బాబు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అనుమతి లేకుండా మోహన్‌బాబుకు సంబంధించినవేవీ వాడరాదని, ఆయన కంటెంట్‌ను గూగుల్ తొలగించాలని స్పష్టం చేసింది.
Similar News
News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
News November 19, 2025
ఆన్లైన్లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్లైన్లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
News November 19, 2025
నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.


