News February 1, 2025

కోటి మందికి ఊరట

image

కొత్త పన్ను విధానంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.12లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని తాజాగా మీడియాతో వెల్లడించారు. పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గతంలో రూ.8లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారని గుర్తుచేశారు.

Similar News

News December 3, 2025

రెడ్కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా మనోహర్

image

తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా మెట్‌పల్లి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన ఏడాది కాలం పాటు కొనసాగనున్నారు. పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్టుల స్థాపన తదితర ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో ఆయన పాలు పంచుకోవాల్సి ఉంటుంది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్‌ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.

News December 3, 2025

‘ది రాజా సాబ్’ రన్ టైమ్ 3గంటలు ఉండనుందా?

image

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్‌పై SMలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్ బుకింగ్ యాప్స్‌లో రన్ టైమ్ 3.15 గంటలు ఉన్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. భారత్‌లోనూ దాదాపుగా ఇదే రన్ టైమ్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.