News August 28, 2024
పేటీఎంకు ఊరట: విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి

పేటీఎం పేమెంట్ బ్యాంకు సర్వీసెస్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. అనుమతి రావడంతో పేమెంట్ బ్యాంక్స్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. భారతీయ కంపెనీగా తాము నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని పేర్కొంది. గతంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పేమెంట్ బ్యాంకు సేవల్ని ఆర్బీఐ నిషేధించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 9, 2026
మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి
News January 9, 2026
ఆస్కార్ బరిలో మహావతార్, కాంతార: చాప్టర్-1

ఆస్కార్-2026 బరిలో మహావతార్ నరసింహ, కాంతార: చాప్టర్-1 నిలవనున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. బెస్ట్ పిక్చర్ విభాగంలో పోటీ పడనున్నట్లు తెలిపింది. ఇందుకు ఎంతో గర్వపడుతున్నట్లు పేర్కొంది. గతేడాది విడుదలైన ఈ రెండు చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతారలో విజువల్ ఎఫెక్ట్స్, రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి.
News January 9, 2026
ALERT: మీ బండి పొగ కక్కుతోందా?

రోడ్లపై మితిమీరిన పొగ కక్కే వాహనాలతో వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఫిట్నెస్ లేని వాహనాలతో గాలి కలుషితం చేస్తే MV యాక్ట్ 2019 ప్రకారం కఠిన చర్యలు తప్పవు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే ₹10,000 వరకు జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. రెండోసారి తప్పు చేస్తే శిక్షా కాలం ఆరు నెలలకు పెరుగుతుంది. మీ వద్ద ఇలాంటి వాహనాలుంటే రిపేర్ చేయించుకొని రోడ్డెక్కండి. share it


