News December 31, 2024
పేర్ని నానికి హైకోర్టులో ఊరట

AP: రేషన్ బియ్యం మిస్సింగ్ <<15028644>>కేసులో<<>> మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తనను ఏ6గా చేర్చడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. పేర్ని నానిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను JAN 6కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఆయన సతీమణికి కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 27, 2025
భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.
News November 27, 2025
30 రోజుల్లో 1400 భూకంపాలు

ఇండోనేషియాలో గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్పై ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి.


