News January 15, 2025
పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వచ్చే నెల 14 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు <<14959397>>కొట్టేయడంతో<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News September 12, 2025
రైలు నుంచి దూకేసిన నటి.. గాయాలు

బాలీవుడ్ నటి కరిష్మా శర్మ రైలు నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘షూటింగ్ కోసం బయల్దేరేందుకు చర్చిగేట్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కా. కానీ నా స్నేహితులు ఆ రైలును అందుకోలేకపోయారు. దీంతో నేను భయపడిపోయి కదులుతున్న రైల్లో నుంచే దూకేశా. నా వీపు, తలకు గాయాలయ్యాయి. నేను త్వరగా కోలుకునేందుకు మీ ప్రేమ, అభిమానం అవసరం’ అని ఆమె రాసుకొచ్చారు.
News September 12, 2025
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. Sensex 152 పాయింట్ల లాభంతో 81,700 వద్ద, Nifty 49 పాయింట్ల వృద్ధితో 25,054 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, మారుతీ సుజుకీ, టాటామోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్, సిప్లా, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో, SBI, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
News September 12, 2025
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం

TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే ఎస్పీబీ విగ్రహాన్నీ నిర్మించనున్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతికశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తిచేయనున్నారు. కాగా కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.