News October 18, 2024
సద్గురుకు సుప్రీంకోర్టులో ఊరట.. కేసు కొట్టివేత

సద్గురు/జగ్గీ వాసుదేవ్‌కు ఊరట లభించింది. బ్రెయిన్‌వాష్ చేసి తమ కుమార్తెలను ఈశా యోగా సెంటర్లోనే ఉంచుతున్నారని ఓ తండ్రి వేసిన <<14260998>>HCPని<<>> సుప్రీంకోర్టు కొట్టేసింది. తామిద్దరం మేజర్లమని, ఇష్టంతోనే అక్కడ ఉంటున్నామని, ఆశ్రమం నుంచి బయటకెళ్లే స్వేచ్ఛ తమకుందన్న కుమార్తెల వాంగ్మూలాలను కోర్టు నోట్ చేసుకుంది. ఈశా సెంటర్ పాటించాల్సిన ఇతర రూల్స్‌పై ఈ కేసు క్లోజింగ్ ప్రొసీజర్స్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
Similar News
News September 19, 2025
ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్‌తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జెన్నిఫర్ తెలిపారు.
News September 19, 2025
రోజూ వాల్నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలా?

* మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
* బరువును నియంత్రిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
* సంతాన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి
* ఎముకలను బలోపేతం చేస్తాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
* షుగర్ రాకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.
Share It
News September 19, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.