News December 27, 2024
సజ్జల భార్గవ్కు ఊరట

AP: సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. 13 కేసులకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
Similar News
News January 24, 2026
ఈ సంకేతాలు కనిపిస్తే.. మొబైల్ మార్చే టైం వచ్చేసినట్టే!

☛ సేఫ్టీకి అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆగిపోవడం
☛ వాట్సాప్, ఫేస్బుక్, బ్యాంకింగ్ యాప్స్ క్రాష్/స్లో కావడం
☛ ఛార్జింగ్ త్వరగా పడిపోవడం
☛ ఎక్కువసార్లు ఛార్జ్ చేయాల్సి రావడం
☛ మొబైల్ స్లో కావడం
– కాల్స్ చేసేటప్పుడు కూడా హ్యాంగ్ అవుతుంటే మీరు మొబైల్ మార్చాల్సిన టైం వచ్చేసినట్టేనని గుర్తించండి.
News January 24, 2026
ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

ఉమెన్స్: ఆస్ట్రేలియాతో పెర్త్లో మార్చి 6వ తేదీ ఆడనున్న ఒకే ఒక టెస్ట్ మ్యాచ్కు 15 మందితో కూడిన భారత జట్టును BCCI ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన(VC), షెఫాలీ, జెమీమా, అమన్జోత్, రిచా, ఉమ, ప్రతికా రావల్, హర్లీన్, దీప్తి, రేణుక, స్నేహ్ రాణా, క్రాంతి, వైష్ణవి, సయాలి.
News January 24, 2026
సహజ కాన్పుతో సమస్యలు వస్తాయా?

నార్మల్ డెలివరీ అయినా మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. డెలివరీ తర్వాత యోని పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు రావడం, గర్భాశయ వ్యాధి, మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి. కొందరికి నార్మల్ డెలివరీలో కుట్లు వేస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు కుట్లు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సహజ కాన్పు తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.


