News March 24, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌కు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌కు ఊరట దక్కింది. అతడిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో శ్రవణ్ పోలీసుల విచారణకు సహకరించాలని పేర్కొంది. ఇదే కేసులో నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం 2 వారాల సమయం కోరింది. దీంతో విచారణను ఉన్నత న్యాయస్థానం 2 వారాలు వాయిదా వేసింది.

Similar News

News March 26, 2025

అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్‌తో దుమారం

image

TG: కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి KTR చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని Dy.CM భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. KTR వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో BRS సభ్యులు వాకౌట్ చేశారు.

News March 26, 2025

ఆ ఒక్క సలహా విఘ్నేశ్‌ జీవితాన్ని మార్చేసింది!

image

ముంబై స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్‌ గురించి అతని స్నేహితుడు మహమ్మద్ షరీఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ‘విఘ్నేశ్ మొదట్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. లెగ్ స్పిన్‌కు మారి నైపుణ్యం సాధిస్తే మేలు చేస్తుందని సూచించా. నేను ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అతనికి కొన్ని టెక్నిక్స్ నేర్పించా. పుతుర్ టాలెంట్ చూసి క్రికెట్ క్యాంపులకు వెళ్లమని చెప్పా. ఇద్దరం కలిసి 2-3 ఏళ్లు క్యాంపులకు వెళ్లాం’ అని తెలిపారు.

News March 26, 2025

కొడాలి నాని ఆరోగ్యంపై స్పందించిన ఆయన టీమ్

image

AP:వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వచ్చిన వార్తల విషయంలో ఆయన టీమ్ ట్విటర్లో స్పందించింది. ‘కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన క్షేమంగా ఉన్నారు’ అని వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!