News February 4, 2025
దివ్యాంగులకు ఊరట.. ఆ నిబంధన తొలగింపు
రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 2022, ఆగస్టు 10న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను పునఃసమీక్షించాలని, ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Similar News
News February 4, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే(36) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈనెల 6 నుంచి AUSతో జరిగే రెండో టెస్ట్ మ్యాచే తనకు చివరిదని తెలిపారు. SL తరఫున 99 టెస్టుల్లో 7,172 పరుగులు, 50 ODIల్లో 1,316 రన్స్ చేశారు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించారు. 30 టెస్టులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల ఫామ్ కోల్పోవడంతో రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు.
News February 4, 2025
అసెంబ్లీ వాయిదా.. హరీశ్ ఫైర్
TG: అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై BRS MLA హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’ అని ఎద్దేవా చేశారు.
News February 4, 2025
దూరమై ఒక్కటైన వేళ.. ఉద్వేగ క్షణాలు!
మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లగా రద్దీ కారణంగా చాలా మంది తప్పిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫాఫా మౌ జంక్షన్ రైల్వే స్టేసన్‌లో ఓ మహిళ తప్పిపోగా.. ఆమెను తన భర్తతో కలిపేందుకు రైల్వే పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించి, అనౌన్స్మెంట్స్ ఇచ్చి ఎట్టకేలకు ఒక్కటి చేశారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనై అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఫొటో వైరలవుతోంది.