News May 1, 2024
దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
TG: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఏడుగురు పోలీసులకు ఊరట లభించింది. నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు స్టే విధించింది. పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్కర్ కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నివేదిక సరిగా లేదని వాదించారు. వాదనల అనంతరం పోలీసులు, షాద్ నగర్ తహసీల్దార్‌పై చర్యలు వద్దంటూ కోర్టు ఆదేశించింది.
Similar News
News December 24, 2024
టీమ్ ఇండియా సూపర్ విక్టరీ
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. 115 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. 359 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 243 రన్స్‌కు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (106) అద్భుత శతకం బాదారు. కానీ మిగతా బ్యాటర్లు ఆమెకు సహకారం అందించలేకపోయారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, ప్రతిక రావల్, సాధు, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
News December 24, 2024
పెండింగ్ ఛలాన్లపై డిస్కౌంట్.. పోలీసులు ఏమన్నారంటే?
వాహనదారులకు తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారని, వాహనాలపై ఉన్న పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ఇచ్చారనే మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వరకు బైక్ ఫైన్లపై 80%, కార్లపై 60% డిస్కౌంట్‌తో చెల్లించాలని మెసేజ్‌లో ఉంది. వాహనదారులు దీనిని నమ్ముతుండటంతో పోలీసులు స్పందించారు. ఈ ప్రకటన ఫేక్ అని, దీనిని నమ్మొద్దని సూచించారు.
News December 24, 2024
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు
AP: సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ-1గా సంజయ్, ఏ-2గా సౌత్రికా టెక్నాలజీస్, ఏ-3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను చేర్చింది. కాగా గతంలో సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సంజయ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.