News August 14, 2024
వల్లభనేని వంశీకి ఊరట!
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈనెల 20 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
Similar News
News January 21, 2025
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ఎటాక్ మధ్య తేడా ఇదే!
చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపుతుంది. అప్పుడు CPR చేయాలి. మెదడుకు రక్తాన్ని పంప్ చేయకపోవడంతో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అవుతాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేయాలి. చికిత్స చేయకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది.
News January 21, 2025
జనవరి 21: చరిత్రలో ఈరోజు
1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం
News January 21, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.