News October 29, 2024

హైకోర్టులో వైసీపీ ఎంపీకి ఊరట

image

AP: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Similar News

News November 21, 2025

తిరుమల: సర్వదర్శనానికి 8 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 66,839 మంది దర్శించుకోగా, 19,220 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News November 21, 2025

విశాఖలో ‘కాగ్నిజెంట్’.. JAN నుంచి కార్యకలాపాలు!

image

AP: దిగ్గజ IT కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్‌ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.