News December 20, 2024
అరెస్టు నుంచి రిలీఫ్.. విచారణకు పిలిచే అవకాశం!
TG: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ ఇవాళో, రేపో అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను 10 రోజులపాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. అదే సమయంలో విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపించవచ్చు.
Similar News
News December 21, 2024
శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..
శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. చలికాలంలో బాదం, కాజు, వాల్నట్స్, ఖర్జూరాలు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెయ్యి, తేనె శరీరంలో వేడి పుట్టిస్తాయి. జొన్నలు, రాగులు తీసుకోవడం మంచిది. బెల్లం నువ్వుల లడ్డూ, పసుపు, గుడ్లు, చికెన్ తీసుకుంటే త్వరగా జీర్ణం కాక శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా ఉంటుంది.
News December 20, 2024
పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!
పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువులపై దాడులు అధికంగా జరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువులపై 112 దాడి ఘటనలు జరగ్గా, బంగ్లాలో 2,200 ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిన తరువాత దాడులు పెరిగినట్టు వెల్లడించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.
News December 20, 2024
ఇలా చేస్తే పిల్లలు పుట్టరు!: రీసెర్చ్
* ఫాస్ట్‌ఫుడ్ లాంటి ప్రాసెస్డ్ ఆహారం తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
* అధిక బరువు పెరిగిన వారిలో వీర్యకణాల ఉత్పత్తి మందగించేందుకు 81% అవకాశముంది.
* ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారిలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
* స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది.