News April 7, 2025
ధరల్లో మార్పులు చేయవద్దు: ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచన

పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్‌కు రూ.2 చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించింది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటించింది. ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
Similar News
News September 13, 2025
కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.
News September 13, 2025
ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.
News September 13, 2025
ALERT: ITR ఫైల్ చేయడం లేదా?

2024-25FYకి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) ఫైల్ చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. కేంద్రం రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని చాలామంది ఫైల్ చేయడం లేదు. కానీ ఈ నిర్ణయం 2025-26 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో ఆదాయం రూ.3 లక్షలు దాటినవారు కూడా ఇప్పుడు ITR ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. SEP 15 డెడ్‌లైన్ దాటితే రూ.5వేల వరకు పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారు.