News November 12, 2024
BRS ఎమ్మెల్యే మాగంటికి ఊరట

TG: జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆధారాలు లేని పిటిషన్ కొట్టేయాలని మాగంటి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేయగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణపై స్టే విధించింది. దీంతో పాటు ప్రతివాది అజహరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.
Similar News
News November 12, 2025
మీరూ ఈ ప్రశ్న అడుగుతున్నారా?

పాతికేళ్లు దాటిన యువతకు సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్?’ ఇలా పదేపదే అడగడం వల్ల వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిద్రలేమి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి వాటికి గురవుతారని, తమలో ఏదో లోపం ఉందని భావన కలుగుతుందంటున్నారు. ఫలితంగా జనాలకు దూరంగా ఉంటారని దీంతో డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ థాట్స్ వస్తాయంటున్నారు.
News November 12, 2025
NIA, ఐబీ చీఫ్‌లతో అమిత్ షా భేటీ

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్‌లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్‌పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.
News November 12, 2025
స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.


