News October 16, 2024

కాసేపట్లో ఐఏఎస్‌ల రిలీవింగ్ ఉత్తర్వులు

image

TG: ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్‌ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఈ నలుగురూ ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరు రిలీవ్ కానున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ, టూరిజం, మహిళ-శిశు సంక్షేమశాఖ, GHMC కమిషనర్‌ను ప్రభుత్వం వేరే అధికారులతో భర్తీ చేయనుంది.

Similar News

News January 1, 2026

వంటింటి చిట్కాలు

image

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.

News January 1, 2026

BEMLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<>BEML<<>>)లో 50 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, CA,ICWA, MBA, ME, ఎంటెక్, MSW,MA, PhD(హిందీ), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసెస్‌మెంట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bemlindia.in/

News January 1, 2026

కోతితో సినిమా చేస్తున్న మురుగదాస్!

image

స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ AR మురుగదాస్ ఇటీవల వరుస ఫ్లాప్‌లను చూశారు. రజనీకాంత్‌తో ‘దర్బార్’, సల్మాన్‌తో ‘సికిందర్’, శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. తన నెక్స్ట్ సినిమాలో కోతిని లీడ్ రోల్‌గా చూపించనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందని తెలిపారు. దీనిని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.