News November 8, 2024
మతం రాగం అందుకోవాల్సిందే.. సీపీఎం నిర్ణయం
కమ్యూనిస్టులు తమ రాజకీయ విధానంలో పెద్ద మార్పుకే శ్రీకారం చుట్టారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తీర్మాన ముసాయిదా పత్రాన్ని సీపీఐ(ఎం) అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారిని పార్టీలోకి చేర్చుకుని కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రతిపాదించింది. అదే సమయంలో సోషలిజం సాధన, వామపక్షాల ఐక్యతను సాధించడాన్ని లక్ష్యంగా పేర్కొంది.
Similar News
News November 8, 2024
నేను పారిపోలేదు.. హైదరాబాద్లోనే ఉన్నా: కేటీఆర్
TG: అరెస్ట్ చేస్తారనే భయంతో తాను మలేషియా పారిపోయానంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘నేనెక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్నా. ఎవరైనా నా దగ్గరకు రావచ్చు. ఉస్మానియా బిస్కెట్లు, ఛాయ్ తాగి వెళ్లొచ్చు. ముఖ్యంగా రేవంత్ బర్త్ డే కేక్ తీసుకొచ్చినా కట్ చేస్తా. హ్యాపీ బర్త్ డే సీఎం రేవంత్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
News November 8, 2024
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్న <<14550455>>భారీగా తగ్గగా<<>>, ఇవాళ అదేస్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.850 పెరగడంతో రూ.72,850గా పలుకుతోంది. సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,03,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News November 8, 2024
ట్రంప్ను అభినందించిన రాహుల్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తమ భవిష్యత్తు కోసం అమెరికా ప్రజలు మీపై విశ్వాసం ఉంచారు. భారత్ & అమెరికా ప్రజాస్వామ్య విలువలతో చారిత్రాత్మక స్నేహాన్ని పంచుకుంటాయి. మీ నాయకత్వంలో అన్ని రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకుంటాయని విశ్వసిస్తున్నాం’ అని రాహుల్ పేర్కొన్నారు.