News April 23, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.
Similar News
News August 16, 2025
ప్చ్.. ‘బ్యాడ్’మింటన్

భారత బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సైనా, సింధు, శ్రీకాంత్, సాత్విక్, చిరాగ్ వంటి షట్లర్లు వరల్డ్ టాప్ ర్యాంకులను ఏలారు. ఇప్పుడేమో టాప్10లో సాత్విక్-చిరాగ్ జోడీ(9) మినహా ఎవరూ లేరు. 15లో సింధు, 21లో లక్ష్యసేన్ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ, అకాడమీలకు ప్రోత్సాహం పెరిగాయి. ఆట మాత్రం ‘బ్యాడ్’గా మారింది.
News August 16, 2025
నేడు ఝార్ఖండ్‌కు సీఎం రేవంత్

TG: నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఝార్ఖండ్‌కు వెళ్లనున్నారు. మాజీ సీఎం శిబూ సోరెన్ 11వ రోజు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి అక్కడికి చేరుకుంటారు. శిబూ సోరెన్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియజేస్తారు. సోరెన్ మరణం తర్వాత ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీయనున్నారు.
News August 16, 2025
రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.