News October 11, 2025
రిమాండ్ రిపోర్ట్: మద్యం బాటిళ్లకు ఫినాయిల్ స్టిక్కర్లు!

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టైన <<17969515>>జనార్దన్‌రావు<<>> రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. ‘నిందితుడు 2012లో మద్యం వ్యాపారం స్టార్ట్ చేసి కరోనాతో ఆర్థికంగా నష్టపోయాడు. 2021 నుంచి HYDలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో లిక్కర్ పోసి డౌట్ రాకుండా ఫినాయిల్ స్టిక్కర్లు వేసేవాడు. ఆపై ఇబ్రహీంపట్నం ANR బార్‌కు తెచ్చి విక్రయించేవాడు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 12, 2025
‘PM మీరు చాలా గ్రేట్’.. మోదీకి ట్రంప్ మెసేజ్

అమెరికా రాయబారి సెర్గియో గోర్ PM మోదీని కలిశారు. ఆ సమయంలో మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ కలిసున్న ఫొటోను బహూకరించారు. దానిపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా గ్రేట్’ అని రాసిన ఒక స్పెషల్ నోట్ ఉంది. అలాగే సెర్గియో కూడా భేటీ అనంతరం ట్రంప్‌కు PM మోదీ ‘గ్రేట్ పర్సనల్ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ కార్యదర్శి మిస్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌నూ కలిశారు.
News October 12, 2025
అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు

1911: భారత మాజీ క్రికెటర్ విజయ్ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ(ఫొటోలో)జననం
1983: మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ జననం
1991: హీరోయిన్ అక్షర హాసన్(ఫొటోలో) జననం
News October 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.