News October 20, 2024
పాత సంజయ్‌ను గుర్తుచేశారు

TG: నిన్న గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బండి సంజయ్ పాత రోజులను గుర్తు చేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని అన్న విషయాన్ని పక్కనపెట్టి రోడ్డుపై ఒకప్పటి రాష్ట్ర BJP అధ్యక్షుడిలా బైఠాయించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ ‘ఛలో సెక్రటేరియట్’కు పిలుపునివ్వగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత GO 29 రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News February 16, 2026
T20 WCలో ఇవాళ్టి మ్యాచులు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు అఫ్గాన్‌తో UAE, 3PMకు ఇంగ్లండ్‌తో ఇటలీ, 7PMకు ఆస్ట్రేలియాతో శ్రీలంక తలపడనున్నాయి. గెలిస్తే ఇంగ్లండ్, శ్రీలంక సూపర్8కి చేరుకోనున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఓడితే అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ప్రస్తుతం ఇండియా, వెస్టిండీస్ మాత్రమే అధికారికంగా సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి.
News February 16, 2026
మాజీ ఎంపీ కన్నుమూత

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
News February 16, 2026
చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, చర్మంముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గట్ ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే చేపలు, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, అవకాడో, దాల్చినచెక్క, గ్రీన్‌టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.


