News October 1, 2024
వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ ఫీచర్

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ అనే ఫీచర్ రానుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌లో ‘రిమైండర్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే యూజర్లకు అన్‌సీన్ స్టేటస్‌ల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. దీని వల్ల రెగ్యులర్‌గా స్టేటస్లు చూడని వారు, కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే వారు ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫేవరెట్/ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్స్ స్టేటస్‌లపైనే ఇది ఫోకస్ చేస్తుందని సమాచారం.
Similar News
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్‌లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


