News July 16, 2024
ప్రభాస్ ‘రాజాసాబ్’లో రీమిక్స్ సాంగ్?

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీలో ఓ హిందీ పాటను రీమిక్స్ చేయనున్నట్లు సమాచారం. పాత హిందీ పాటను తీసుకుని దానిని అన్ని భాషల్లో రీమిక్స్ చేస్తారట. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ సెట్స్లో తిరిగి జాయిన్ కానున్నట్లు సమాచారం.
Similar News
News November 15, 2025
KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
News November 15, 2025
రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

రైలులో తక్కువ ధరకే వస్తువులను <
News November 15, 2025
BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.


