News March 26, 2024

ఇండియాలో 2.25M వీడియోల తొలగింపు

image

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇండియాలో 2.25మిలియన్ల వీడియోలను తొలగించింది. 2023లో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన వీడియోలను తొలగించినట్లు తెలిపింది. వీడియోలు తొలగించిన దేశాల్లో భారత్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సింగపూర్ 12,43,871 వీడియోలతో రెండో స్థానంలో ఉంది. అమెరికా(7,88,354) మూడో స్థానంలో ఉంది.

Similar News

News October 4, 2024

‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్

image

డైరెక్టర్ కొరటాల శివతో తన ప్రయాణం ‘బృందావనం’ సినిమాతో ప్రారంభమైందని, ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీ మెంబర్‌గా మారారని ఎన్టీఆర్ తెలిపారు. ‘దేవర’ సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు. ‘ఈ జన్మలో నేను మీ కోసం ఎంత చేసినా అది వడ్డీ మాత్రమే. వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా’ అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

News October 4, 2024

పరువు నష్టం.. ఈ శిక్షలు పడొచ్చు

image

ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో <<14263146>>పరువునష్టం<<>> దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. IPC సెక్షన్ 500 ప్రకారం ఈ శిక్షలుంటాయి. గతంలో మోదీ పేరుపై చేసిన కామెంట్స్‌కు గానూ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే దానిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్‌కు 15రోజుల జైలు శిక్ష పడింది.

News October 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 4, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.