News June 17, 2024

జగన్ తాడేపల్లి నివాసం వద్ద బారికేడ్ల తొలగింపు

image

AP: తాడేపల్లిలో మాజీ CM జగన్ నివాసం వెనుక రోడ్డుపై భద్రత దృష్ట్యా ప్రజల రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను అధికారులు తాజాగా తొలగించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, దానికి దిగువనున్న రోడ్డుపై ప్రవేశం లేదు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు వెళ్లాల్సినవారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లేవారు. టీడీపీ సర్కారు ఆ మార్గాన్ని తాజాగా ప్రజలకు తెరిచింది.

Similar News

News January 27, 2026

వీరమ్మతల్లి తిరునాళ్లు.. ప్రత్యేకతలెన్నో..

image

AP: ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు రేపే ప్రారంభం. 15రోజుల వేడుకలకు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు వస్తారు. తొలిరోజు పోలీస్ శాఖ తరఫున మొదటి పసుపు, కుంకుమ సమర్పించాక మెట్టినింటి నుంచి ఆలయానికి అమ్మ బయల్దేరడం ఆనవాయితీ. ఇక ఆసక్తికర శిడిబండి ఉత్సవం FEB7న. ప్రత్యేకంగా తయారుచేసిన బండిలో పెట్టిన గంపలో, పెళ్లి కాబోయే SC యువకుడిని కూర్చోబెట్టి ఆలయం చుట్టూ బండి తిప్పుతూ అరటికాయలతో కొడతారు.

News January 27, 2026

బెంగళూరు అంకుల్ అంటూ జగన్‌పై టీడీపీ సెటైర్లు

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ Xలో సెటైరికల్ పోస్ట్ చేసింది. ‘ఏ బెంగ, బెదురులేని దొంగ బెంగళూరు అంకుల్‌. ఆయనకు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సంక్రాంతికి సొంతూరు రాడు. రిపబ్లిక్ డేని పట్టించుకోడు’ అని పేర్కొంది. దీనిపై వైసీపీ శ్రేణులు ఫైరవుతున్నాయి. ముందు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.

News January 27, 2026

రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

image

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.