News September 15, 2024
సవాలుగా మారిన బోట్ల తొలగింపు

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశే ఎదురైంది. కట్ చేసిన బోట్లు బయటకు వచ్చినట్లే వచ్చి నీట మునిగాయి. దీంతో పడవలను బయటకు తీసేందుకు మరో ప్లాన్‌ను అబ్బులు టీమ్ రెడీ చేస్తోంది. ప్రస్తుతానికి పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు నీట మునిగిన పడవలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగించనున్నారు.
Similar News
News November 14, 2025
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,237 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, ఐటీ, ఆటో, FMCG స్టాక్స్ ఎరుపెక్కాయి. ముత్తూట్ ఫిన్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News November 14, 2025
BRSకు స్వల్ప ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది.
News November 14, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


