News June 26, 2024

‘జగన్మోహనపురం’ బోర్డు తొలగింపు!

image

AP: తమ ఊరి పేరు పోలవరం అయితే జగన్మోహనపురం అని పెట్టారంటూ కొందరు యువకులు ఆర్చిపై ఆ పేరును తొలగించారు. కాకినాడ(రూ) మండలం పోలవరంలో ఈ ఘటన జరిగింది. 2020లో కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి CM జగన్ వచ్చారు. దీంతో మార్గమధ్యలోని పోలవరం వద్ద ఆర్చి కట్టి జగన్మోహనపురం అని రాశారు. దీన్ని YCP నేతలు తీయలేదని.. GOVT మారడంతో తొలగిస్తున్నామని యువకులు తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగురవేశారు.

Similar News

News June 29, 2024

పోల’వరం’ అందేదెప్పుడో?

image

AP: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో 3, 4 ఏళ్లు పట్టేలా ఉంది. వరదలతో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతింది. అంతేకాదు ఎగువ కాఫర్ డ్యామ్ కింది నుంచి నీరు లీక్ అవుతోందని ఇంజినీర్లు గుర్తించారు. డయాఫ్రం వాల్ సమస్యను పూర్తిగా గుర్తించి, నివేదిక ఇచ్చేందుకు 6 నెలలు.. దాన్ని రిపేర్ చేసేందుకు మరో 2 సీజన్లు పడుతుందని సమాచారం. ఆ తర్వాత దానిపై 45.72 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్‌ ఫిల్ డ్యామ్ నిర్మించాలి.

News June 29, 2024

టీ20 WC చరిత్రలో ఒక్కసారీ అలా జరగలేదు!

image

టీ20 WC చరిత్రలో ఇప్పటివరకూ ఫైనల్ ఆడిన జట్లు మరోసారి ఫైనల్‌లో తలపడలేదు. ప్రతీ ఎడిషన్‌లో కొత్త ప్రత్యర్థులే ఎదురుపడ్డారు. భారత్VSపాక్ (2007), పాక్VSశ్రీలంక (2009), ఇంగ్లండ్VSఆసీస్ (2010), వెస్టిండీస్VSశ్రీలంక (2012), శ్రీలంకVSభారత్ (2014), వెస్టిండీస్VSఇంగ్లండ్ (2016), ఆస్ట్రేలియాVSన్యూజిలాండ్ (2021), ఇంగ్లండ్VSపాక్(2022), సౌతాఫ్రికాVSఇండియా (2024) ఫైనల్ చేరాయి.

News June 29, 2024

‘RRR’కు రూట్ క్లియర్!

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. ఒకేసారి ఉత్తర, దక్షిణ భాగాల(350.76KM) పనులు చేపట్టడమే ఉత్తమమన్న కేంద్రమంత్రి గడ్కరీ సూచనకు CM రేవంత్ అంగీకరించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ఊపందుకోనుంది. నిర్మాణంలో భాగంగా తీగలు, స్తంభాలు, పైప్‌లైన్ల తరలింపు కోసం కేంద్రమే రూ.300Cr ఇస్తుందని మంత్రి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ఇదేవిషయమై సందిగ్ధత నెలకొంది.