News April 6, 2024
ముస్లిం మహిళల హిజాబ్ తొలగింపు.. రూ.145కోట్ల పరిహారం!

న్యూయార్క్‌లో (US) ఇద్దరు ముస్లిం మహిళలకు బలవంతంగా హిజాబ్ తొలిగించి ఫొటో తీసినందుకు అక్కడి యంత్రాంగం రూ.145కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అధికారుల చర్యతో అసౌకర్యానికి గురయ్యామని జమీలా క్లార్క్, అర్వా అజీజ్ 2018లో కేసు వేశారు. తాజాగా న్యూయార్క్ యంత్రాంగం పరిహారం చెల్లించేందుకు ఓకే చెప్పింది. ఈ డబ్బును రూ.6.5లక్షల చొప్పున ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న దాదాపు 4000 మంది మహిళలకు ఇవ్వనున్నారు.
Similar News
News December 8, 2025
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

☛ బీపీ, షుగర్లను అదుపులో ఉంచుకోవాలి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
☛ ఎక్కువగా ఉప్పు కలిపిన ఫుడ్ తీసుకోకూడదు.
☛ రోజూ 2-3లీటర్ల నీరు తాగాలి.
☛ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
☛ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
☛ తరచుగా కిడ్నీల పనితీరు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
News December 8, 2025
సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.
News December 8, 2025
ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనం గర్వపడాలి: విజయ్

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని IND మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ‘ధోనీ సహజ, ప్రత్యేకమైన నాయకుడు. ఆయనలా నిర్ణయాలు తీసుకోవడం మరొకరికి సాధ్యం కాదు. 2007 T20 WC చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించడం ఇలాంటిదే. ధోనీ కొట్టే సిక్సర్ల రేంజ్ మరో రైట్ హ్యాండ్ బ్యాటర్ వల్ల కాదు’ అని వ్యాఖ్యానించారు. మహీ కెప్టెన్సీలో విజయ్ 8 సీజన్ల పాటు CSKకు ఆడారు.


