News August 28, 2025
రేవంత్ గెటప్‌లోని వినాయక విగ్రహం తొలగింపు

TG: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం హబీబ్‌నగర్‌లో CM రేవంత్ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకుముందు దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు <<17538582>>ఫిర్యాదు<<>> చేశారు.
Similar News
News August 28, 2025
ఇవాళే లాస్ట్.. IBPSలో 10,270 ఉద్యోగాలు

IBPS క్లర్క్ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. దేశంలోని పలు బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉండగా ఏపీలో 367, టీజీలో 261 ఖాళీలు ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్ట్ చేస్తారు. ibps.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News August 28, 2025
HYDకి బీచ్ రాబోతోంది!

హైదరాబాద్‌లో త్వరలోనే బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానుంది. బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నారు. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది.
News August 28, 2025
GALLERY: తీరొక్క రూపాల్లో కొలువుదీరిన గణపయ్య

తెలుగురాష్ట్రాల్లో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఊరూవాడా మండపాలతో శోభాయమానంగా మారాయి. ఆ గణపయ్య తీరొక్క రూపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. పెద్ద విగ్రహాలు, వివిధ ఆకారాలు, అలంకారాలతో ఉన్న వినాయకుడి రూపాలు ప్రస్తుతం SMలో సందడి చేస్తున్నాయి. పెళ్లి కుమారుడిగా, మహా గణపతిగా, ఉయ్యాల్లో సేదతీరుతున్నట్లుగా ఇలా అనేక అవతారాల్లో ఆ గణేశుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు.