News July 12, 2024
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరు తొలగింపు

AP: గృహ నిర్మాణ పథకానికి గత YCP ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పేరును కూటమి సర్కార్ తొలగించింది. పూర్తైన ఇళ్లకు సంబంధించి పాస్ పుస్తకాలు, సర్టిఫికెట్లపై జగన్ బొమ్మలు, YCP రంగులు వేయొద్దని, స్వాగత ద్వారాలపై పేర్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త పేర్లు పెట్టే వరకు 2019కి ముందున్న పేర్లు కొనసాగించాలంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కుని వన్టైమ్ సెటిల్మెంట్ పథకంగా మార్చింది.
Similar News
News January 27, 2026
VASTHU: చీపురును ఎక్కడ ఉంచాలంటే..?

ఇంట్లో చీపురును నిలబెట్టకూడదని, ఇతరులకు కనిపించేలా గుమ్మాల వద్ద ఉంచవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇల్లు తుడవడం ముగిశాక దాన్ని పడుకోబెట్టాలంటున్నారు. ‘చీపురు ఉంచడానికి ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశలు మంచివి కావు. పడమర/దక్షిణ దిశలో ఉంచాలి. ముఖ్యంగా బాత్రూం, స్టోర్రూమ్లలో చీపురు ఉండకూడదు. చీపురును రహస్యంగా, అడ్డంగా ఉంచడం వల్ల ఇంట్లో సిరిసంపదలు నిలుస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 27, 2026
ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లు… ఎవరికి ఎన్ని?

AP: జూన్లో రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో TDP 1, YCP 3 ఉన్నాయి. బడ్జెట్ సెషన్స్లో లేదా తర్వాత వీటికి ఎన్నిక ఉంటుంది. సంఖ్యా బలాన్ని బట్టి ఇవన్నీ కూటమికే దక్కనున్నాయి. వీటిలో 1 BJPకి కేటాయించొచ్చన్న ప్రచారముంది. జనసేన కోరితే 1 ఇచ్చి మిగతా 2 TDP తన వారికి ఇవ్వొచ్చని తెలుస్తోంది. కాగా కౌన్సిల్లో ఖాళీ అయ్యే MLC సీట్లలో JSP వాటా అడిగితే RS సీటు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.
News January 27, 2026
ప్రభుత్వ ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది: రేవంత్

TG: HYD ఆస్తులు, విపత్తుల టైంలో ప్రాణాలు కాపాడటంలో హైడ్రాపాత్ర అభినందనీయమని CM రేవంత్ ప్రశంసించారు. ‘ప్రభుత్వ ఆస్తులు కాపాడటంతో పాటు చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది. ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. వారి ప్రాణాలు కాపాడిన హైడ్రా సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.


