News August 30, 2024
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

AP: కొత్త మెడికల్ కాలేజీలకు గత ప్రభుత్వం పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు YSR పేరు పెడుతూ గత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ ఆస్పత్రులకూ YSR పేరును ఉపసంహరించింది.
Similar News
News December 4, 2025
పుతిన్ పర్యటన ప్రతి అడుగులో ‘FSO’ నిఘా

అత్యంత పటిష్ఠ భద్రత మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది. విదేశీ ప్రముఖుల భద్రతను ఆతిథ్య దేశాలే సహజంగా పర్యవేక్షిస్తుంటాయి. పుతిన్ పర్యటనను మాత్రం రష్యాలోని రహస్య సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చూస్తుంది. ఆయన ఉండే భవనం, తీసుకొనే ఆహారం సహా ప్రతి అడుగులో పలు జాగ్రత్తలు తీసుకుంటారని మాజీ బాడీగార్డు ఒకరు తెలిపారు. పుతిన్ తినే ఫుడ్ను ఫస్ట్ ఓ బాడీగార్డ్ టేస్ట్ చేస్తారని చెప్పారు.
News December 4, 2025
ఈ 3 బ్యాంకులు సేఫ్: RBI

భారత ఆర్థిక వ్యవస్థకు SBI, HDFC, ICICI బ్యాంకులు మూల స్తంభాలని RBI తెలిపింది. వీటిలో డబ్బు సేఫ్గా ఉంటుందని వెల్లడించింది. RBI రూల్స్ ప్రకారం, కామన్ ఈక్విటీ టైర్1 కింద ఎక్కువ నగదు, క్యాపిటల్ ఫండ్ మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ బ్యాంక్ కార్యకలాపాలు, అకౌంట్ హోల్డర్ల డబ్బుపై ప్రభావం చూపదు. అందుకే, ఇవి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు(D-SIB)గా గుర్తింపు పొందాయి.
News December 4, 2025
సూపర్ మూన్.. అద్భుతమైన ఫొటో

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసింది. భూమికి దగ్గరగా, మరింత పెద్దగా, కాంతివంతంగా చందమామ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్ను తమ కెమెరాలలో బంధించి పోస్టులు చేస్తున్నారు. కాగా 2042 వరకు చంద్రుడు ఇంత దగ్గరగా కనిపించడని నిపుణులు చెబుతున్నారు.


